Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 December 2024, 5:24 pm Posted by : ramakrishna

ప్రజావాణికి 80 ఫిర్యాదులు

 బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యా దులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు విన్నవిస్తూ అర్జీలను సమర్పించారు.