ప్రజావాణికి 77 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 77 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, హౌసింగ్ ఏ.ఈ నివర్తి, ఎస్.హెచ్.ఓ విజయ్ బాబు లకు విన్నవిస్తూ అర్జీలు...