Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 6:11 pm Posted by : ramakrishna

ప్రజావాణికి 77 ఫిర్యాదులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 77 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, హౌసింగ్ ఏ.ఈ నివర్తి, ఎస్.హెచ్.ఓ విజయ్ బాబు లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

 

77 complaints to Prajavani

 

ఈ నెల 15న రాష్ట్ర సమాచార కమిషన్ హాజరవుతున్న నేపద్యంలో ఆయా శాఖల అధికారులు పూర్తి స్థాయి నివేదికలతో పాల్గొనాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా తైక్వాండో పోటీలలో ప్రతిభ కనబర్చిన బాలబాలికలను కలెక్టర్ అభినందించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

77 complaints to Prajavani