నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
ఇటీవల నూతనంగా నిజామాబాద్ ఆరవ టౌన్ ఎస్హెచ్ఓ గా బాధ్యతలు చేపట్టిన కే.సందీప్ సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేయాలని ప్రజలకు ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే సూచించారు.