Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 September 2025, 8:07 pm Posted by : ramakrishna

వచ్చింది 671.240 టీఎంసీలు.. వెళ్ళింది 629.399 టీఎంసీలు

మెండోరా, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రధాయిని అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి జూన్ జూన్ 1వ తేదీ నుండి ఇప్పటివరకు 671.240 టిఎంసిల నీరు వచ్చి చేరింది. అలాగే ప్రాజెక్ట్ నుండి ఇప్పటివరకు 629.399 టీఎంసీల నీటిని గోదావరిలోకి, కాకతీయ లక్ష్మి సరస్వతి వరద కాలువ మిషన్ భగీరథ వంటి వాటి ద్వారా విడుదల చేయడం జరిగినట్లు ప్రాజెక్ట్ అధికారి రవి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీ లోకి 3,50,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ 39 గేట్ల ఎత్తి 3,25,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 4000 క్యూసెక్కులు ఎస్కేప్ గేట్ల ద్వారా 4000 క్యూసెక్కులు సరస్వతి కాల్వ ద్వారా 400 క్యూసెక్కులు మిషన్ భగీరథుకు 231 సెకుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం  1091.00 అడుగులు, 80.50 టీఎంసీలు కాగా సోమవారం  1083.20 అడుగులు, 54.292 పిఎంసిల నీరు నిల్వ ఉంది.

  • పర్యాటకుల రాక..

దసరా సెలవులు కావడంతో ప్రాజెక్టు అందాలను ఆస్వాదించడానికి ప్రతినిత్యం పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ప్రాజెక్టు అందాలను చెలదృశ్యాలను ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ ప్రాజెక్టు అందాలను కెమెరాల్లో బంధిస్తూ సాగర తీరంలో సంతోషంగా సేద తీరుతున్నారు.

671.240 TMCs came in.. 629.399 TMCs went out.