Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 December 2024, 4:09 pm Posted by : ramakrishna

పదేళ్లలో తెలంగాణలో 650 కిలోమీటర్ల రైల్వే పనులు

. లోక్ సభలో ఎంపీ అర్వింద్ ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం

నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణలో 2014 నుంచి 2024 నుంచి 650 కిలోమీటర్ల రైల్వే పనులు చేపట్టినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో తెలిపారు. రైల్వే పనులపై ఎంపీ అర్వింద్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్ లో 20శాతం నిధులు సుమారు రూ. వెయ్యి కోట్లు పెంచామని వెల్లడించారు. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్  పాలనలో కేవలం 87 కిలోమీటర్ల మేర పనులు చేపట్టగా, మోదీ ప్రభుత్వం 650 కిలోమీటర్ల పనులు చేపట్టిందని, ఇది 647శాతం ఎక్కువ అని వెల్లడించారు.