. . . ఇద్దరు బాలికలపై లైంగిక దాడులు చేసిన మృగానికి కఠిన కారాగార శిక్ష
. . . బాధిత బాలికలకు ఎనిమిది లక్షల చొప్పున పరిహారానికి న్యాయసేవా సంస్థ కు సిఫార్సు
. . . నిజామాబాద్ పోక్సో కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ తీర్పు
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
అభంశుభం తెలియని పసి పాపాలు వాళ్లు.నిండా ఏడు, ఎనిమిది సంవత్సరాలు నిండిన వారు. పాఠశాలకు వెళ్లడం, ఆటలు ఆడుకోవడం వాళ్లకు తెలుసు.మనుషుల్లో మృగాలు ఉంటాయి అని అసలు తెలువని వయసు. ఆ మగ మృగం చేపలు, గొర్రెలు చూపిస్తానని, చాక్లెట్ ఇస్తానని ఆశచూపి,నమ్మించి మీద పడి అఘాయిత్యం చేసిన అమ్మానాన్నలకు తెలియజెప్పిన తెలివిలేని అమాయకత్వం వారిది.శరీర భాగంలో నొప్పి వస్తున్నదని అమ్మకు చెప్పడం ఏదోలే అనుకున్న అమ్మ.ఒకనాడు బిడ్డకు స్నానం చేయించేటప్పుడు అమ్మ అక్కడ నొప్పిగా ఉంది అనడంతో బిడ్డ భాధను ఒడిసిపట్టిన అమ్మ భర్తను సంప్రదించి మరోసారి బిడ్డను అడిగి తనలాగే పక్కింటి బాలిక కూడా తనలాగే జరిగింద ని తెలపడంతో బాలికల తల్లిదండ్రులు ఎడపల్లి పోలీసులను ఆశ్రయించడంతో వారు నేర విచారణ పూర్తి చేసి అభియోగ పత్రాన్ని పోక్సో కోర్టులో సమర్పించారు. లైంగిక వేధింపులు, లైంగిక దాడుల నుండి పిల్లల రక్షణ చట్టం ప్రకారం న్యాయ విచారణ నిర్వహించిన ప్రత్యేక పోక్సో కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ ఆ మానవ మృగానికి పోక్సో చట్ట ప్రకారం ఇరవై సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం మరో రెండు సంవత్సరాలు కఠిన జైలుశిక్ష విదిస్తూ 93 పేజీల తీర్పు వెలువరించారు.
పోక్సో కోర్టు తీర్పు లోని వివరాలు…నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఓ గ్రామానికి చెందిన ముచ్కూర్ నారాయణ సమీప గ్రామం లో తన అత్తగారి ఇంటి దగ్గర భార్యతో ఉంటు వ్యవసాయ పనులు చేసుకునేవారు. దుర్మార్గపు ఆలోచనలు కలిగి కలిగి తన ఇంటికి దగ్గర లో 2020 సంవత్సరం జులై 01 న మధ్యాహ్నం ఆటలు ఆడుకుంటున్న ఏడు సంవత్సరాల ఒక బాలికను, ఎనిమిది సంవత్సరాల మరొక బాలికను తన పాత ఇంట్లో చేపలు, గొర్రెలు ఉన్నాయి వాటిని చూపిస్తానని ,చాకోలెట్ కూడా ఇస్తానని నమ్మించి వారిని ఇంటికి తీసుకువెల్లి ఎవరులేని సమయంలో బాలికలిద్దరిపై లైంగిక దాడులు చేశాడు.సదరు నేర అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణ లో ముద్దాయి ముచ్కూర్ నారాయణ పై రుజువు అయినట్లు జడ్జి దుర్గా ప్రసాద్ తమ తీర్పులో ధ్రువీకరించారు.పోక్సో చట్టం లోని సెక్షన్ 5 (ఎమ్ ) ప్రకారం పన్నెండు సంవత్సరాల బాలికలపై లైంగిక దాడులు చేసిన నేరానికి ఇరవై సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు ఇరవై వేల రూపాయల జరిమానా విధించారు.ఇండియన్ పినల్ కోడ్ లోని సెక్షన్ 506 ప్రకారం నేరపూరిత బెదిరింపులు చేసినందుకుగాను రెండు సంవత్సరాల కఠిన జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానాలు చెల్లించని యెడల ఆరు నెలల చొప్పున జైలు శిక్ష అనుభవించాలని జడ్జి తమ తీర్పు లో పేర్కొన్నారు.
ఇద్దరు బాధిత బాలికలకు ఎనిమిది లక్షల చొప్పున ఆర్థిక పరిహారానికి సిపార్సు…
నిజామాబాద్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ తీవ్రమైన లైంగిక దాడులకు గురైన ఇద్దరు బాలికలకు ఎనిమిది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక పరిహారం అందజేయడానికి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జడ్జి దుర్గా ప్రసాద్ తన తీర్పులో సిఫార్సు చేశారు. బాలిక లిద్దరు లేత వయసులో లైంగిక దాడులకు గురి కావడం, శరీరక, మానసిక బాధలకు గురైన నేపథ్యంలో వారికి మానసిక, శారీరక ఎదుగుదలకు, విద్య అవసరాలు అధిగమించడానికి వీలుగా ఆర్థిక పరిహారం అవసరం అని జడ్జి తమ తీర్పు లో వ్రాశారు. వారి జీవితాలను పునర్ నిర్మించుకోవడానికి వీలుగా ఎనిమిది లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయడానికి నిజామాబాద్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ వీలైనంత సమయంలో బాధిత బాలికలను ఆదుకోవాలని పేర్కొన్నారు.