6 సెల్ ఫోన్లు రికవరీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సీ ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా ఆరు సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు నిజామాబాద్ 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. నాల్గవ పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు సెల్ఫోన్లు పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివరాలను పోర్టల్లో నమోదు చేసి ఆరు సెల్ఫోన్లు రికవరీ చేసి శనివారం బాధితులకు అప్పగించారు. ఇంకా ఎవరైనా సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.