లోక్‌ అదాలత్‌ ద్వారా 590 కేసులు పరిష్కారం

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలోని జాతీయ లోక్‌ అదాలత్‌లో 590 కేసులు పరిష్కారమయ్యాయి.కోర్టు ఆవరణలో జూనియర్‌ సివిల్‌ జడ్జి భార్గవి ఆధ్వర్యంలో బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి కోర్టు పరిధిలోని సివిల్‌, క్రిమినల్‌, బ్యాంక్‌ తదితర 590 కేసులను పరిష్కరించారు.సుమారు రూ.19.70 లక్షల సెటిల్మెంట్‌ చేశారు.ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి, న్యాయవాదులు రమాకాంత్‌ రావు, భూషణ్‌ రెడ్డి, ఖలీల్‌, మోహన్‌ రెడ్డి, హమీద్‌, మొగులయ్య, అజీమ్‌ పాల్గొన్నారు..