కాకతీయ ద్వారా 5500 క్యూసెక్కులు

బతుకమ్మ,మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ అయినటు వంటి కాకతీయ కాలువ ద్వారా అదనంగా 1500 క్యూసెక్కుల నీటి విడుదల పెంపు చేయడం జరిగింది. గురువారం సాయంకాలం వరకు 4000 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగింది. కానీ శుక్రవారం ఉదయం నుంచి 5500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా శుక్రవారం రోజు 1084.80 అడుగులు, 65.867 టీఎంసీల నీరు నిల్వ ఉంది.