Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 November 2024, 3:44 pm Posted by : ramakrishna

5తులాల బంగారం, 20  తులాల వెండి అపహరణ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని మహాలక్ష్మినగర్ లో దొంగలు బుధవారం అర్ధరాత్రి హల్ చల్ చేశారు. తాళం వేసిన ఇంటి వద్దకు చేరుకున్న ఇద్దరు దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. 5తులాల బంగారం, 20తులాల వెండిని ఎత్తుకెళ్లారు. బాధితులు గురువారం ఉదయం నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై శ్రీకాంత్ కు ఫిర్యాదు చేశారు. దుండగుల కదలికలు సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


5 talas of gold and 20 talas of silver were stolen