Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 November 2024, 1:41 pm Posted by : ramakrishna

మహిళాశక్తి భవనానికి రూ.5కోట్లు

కామారెడ్డి, బతుకమ్మ: జిలాల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.5కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. భవన నిర్మాణానికి జాతీయ రహదారి 44 పక్కన కేటాయించిన భూమిని కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో రంగనాథ్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, పంచాయతీ రాజ్ ఈఈ దుర్గా ప్రసాద్, డీపీఎం రమేశ్ బాబు తదితరులున్నారు.

5 crores for Mahila Shakti Bhavan