నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగరంలోని 48వ డివిజన్ కు చెందిన సత్యపాల్ పద్మశాలి సంఘం సభ్యులతో కలిసి బీజేపీలో చేరారు. వారికి పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్ లోని ఎంపీ నివాసంలో 48వ డివిజన్ నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణతో కలిసి బీజేపీలో చేరారు. నరేంద్రమోడి సిద్దాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పని చేస్తామని తెలిపారు.