కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో 48 కిలోల గంజాయి పట్టివేత
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలోని కేంద్ర రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి అక్రమ రవాణాను ఎక్సైజ్ పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారుల వివరాల ప్రకారం, సంబల్‌పూర్ నుంచి నాగవల్లి వైపు వెళ్తున్న రైలులో గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన సామాను పరిశీలించగా 48 కిలోల గంజాయి బయటపడింది. ఈ కేసులో రోహిత్ (21)...