Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 5:35 pm Posted by : ramakrishna

గడిచిన మూడు వారాలలో 432 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

 

. . . రూ.40,25,000 జరిమానా విధించిన సంబంధిత కోర్టులు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన 3 వారాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 432 మందిని పట్టుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వారిని సంబందిత కోర్టులలో హాజరుపరచగా 25 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించారన్నారు. మిగిలిన వారికి రూ.40,25,000 జరిమానా విధించినట్టు తెలిపారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనానికి సంబంధించిన పత్రాలు సక్రమముగా తమ వద్ద ఉంచుకోవాలని తెలిపారు. డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వారి లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయబడునని, మద్యం త్రాగి వాహనం నడిపినపుడు అనుకోని రోడ్ ప్రమాదం జరిగినట్లయితే ఇన్సూరెన్సు కూడా లభించదని పేర్కొన్నారు. మైనర్లు తాగి వాహనం నడిపి దొరికినటైతే మైనర్, వెహికల్ ఓనర్ పైన ఛార్జ్ షీట్ నమోదు చేయబడునపి, అలాగే జైలు శిక్ష విధించే అవకాశం కలదని తెలిపారు. మోటర్ వెహికల్ యాక్ట్ 1989 (చట్టం సవరణ – 2019)  అమలులో ఉన్నందున డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొదటిసారి పట్టుబడినట్లయితే 10,000/- జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా తో పాటు జైలు శిక్ష విధించబడును.  అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండోసారి పట్టుబడినట్లైతే 15,000/- జరిమానా లేదా జైలు శిక్ష లేదా జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడును.