42 శాతం రిజర్వేషన్లు పార్టీపరంగా ఇస్తాం :  సీఎం రేవంత్

హైదరాబాద్, బతుకమ్మ :  కులగణన సర్వేపై అసెంబ్లీలో జరిగిన చర్చలో  రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా సాధ్యంకాకపోతే.. పార్టీపరంగా ఇస్తామని ప్రకటించారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తుందని.. ఇందుకు మీరు సిద్ధంగా  ఉన్నారా.. బీఆర్ ఎస్, బీజేపీ పార్టీలకు సీఎం సవాల్ విసిరారు. బీసీలకు రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ జరగాలని డిమాండ్ చేశారు.