Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 October 2025, 8:01 pm Posted by : ramakrishna

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 42మందికి జైలు

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకే రోజు 42మందికి జైలు శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. దేవుని పల్లి పీఎస్ పరిధిలో 4గురికి ఒక రోజు జైలు రూ.1000 జరిమాన, కామారెడ్డి పీఎస్ పరిధిలో ఇద్దరికి ఒకరోజు జైలు, ఒక్కొక్కరిరి రూ.1000 జరిమాన, సదాశివ నగర్ పీఎస్ పరిధిలో ఒకరికి ఒకరోజు జైలు, రూ.1000 జరిమాన, మాచారెడ్డి పీఎస్ పరిధిలో ఒకరికి ఒకరోజు జైలు, రూ.1000 జరిమాన విధించినట్లు తెలిపారు. కామారెడ్డిలో 13, దేవునిపల్లిలో 15మంది, బీబీపేట్, బిక్కనూర్, దోమకొండ పీఎస్ పరిధిలో 2 రూ.34వేల జరిమాన విధించినట్లు తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా కామారెడ్డి పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపే వ్యక్తులపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని అన్నారు.