Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 October 2025, 9:43 pm Posted by : ramakrishna

42% బీసీ రిజర్వేషన్ షెడ్యూల్ లో పెట్టి చట్ట బద్దత చేయాలి

  • మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్వామి

 

భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి పంపించిన 42%బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగ సవరణ ద్వారా 9 షెడ్యూల్ లో పెట్టి చట్టబద్దత కల్పిస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయించాలని మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం అఖిల పక్షం, బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు బంద్ కు మద్దత్తునిస్తూ బంద్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేసి క్యాబినేట్ ఆమోదం పొంది చట్టపరమైన అన్ని చర్యలను తీసుకొని గవర్నర్, రాష్ట్రపతిల ఆమోదం కోసం బిల్లును పంపడం జరిగిందన్నారు. ఒకపక్క బిజేపి బీసీలకు అన్యాయం చేస్తూ ఒకపక్క మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా ఈ తెలంగాణ బంద్ తో బిజెపి ప్రభుత్వం కనువిప్పు కలగాలని బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలనీ, లేకుంటే రాబోయే రోజుల్లో బిజెపి ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర బిసి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.ఈ బంద్ కు సంపూర్ణంగా  సహకరించిన భీమ్ గల్ మండల వాణిజ్య,వ్యాపార, విద్య సంస్థలు భీమ్ గల్ మండల ప్రజలకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.