Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2025, 7:30 pm Posted by : ramakrishna

మద్యం షాపుల నిర్వహణకు 419 దరఖాస్తులు

నిజామాబాద్, బతుకమ్మ : మద్యం షాప్ ల దరాఖాస్తుల ప్రక్రియ 2025-2027 సంవత్సరానికి మద్యం దుకాణాల నిర్వహణకు  జిల్లా వ్యాప్తంగా 102 వైన్ షాప్ లకు  బుధవారం వరకు మొత్తం 419 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి తెలిపారు.  నిజామాబాద్ స్టేషన్ ఫరిది లో మొత్తం 36 వైన్ షాప్లకు గాను 150 దరఖాస్తులు వచ్చాయి. బోధన్ స్టేషన్ పరిధిలో మొత్తం18 వైన్ షాప్లకు  69 దరఖాస్తులు వచ్చాయి. ఆర్మూర్ స్టేషన్  పరిధిలో మొత్తం 25 వైన్ షాప్లకు 89 దరఖాస్తులు వచ్చాయి. భీంగల్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వైన్ షాప్లకు గాను  52 దరఖాస్తులు వచ్చాయి. మోర్తాడ్ స్టేషన్ పరిధిలో మొత్తం 11 వైన్ షాప్లకు గాను 59 దరఖాస్తులు వచ్చాయి.