. . . 83 గంజాయి మొక్కలు దహనం
. . . 286 గ్రాముల అల్ప్రాజోలం . . . 40 గ్రాముల క్లోరోహైడ్రెట్ కాల్చివేత
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఎన్డీపీఎస్ యాక్టు కింద 9 కేసులలో సీజ్ చేసిన నిషేదిత మత్తు పదార్థాలను ధ్వంసం చేయడం లేదా దహనం చేయడం జరిగిందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ ల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించి సీజ్ చేసిన 402 కిలోల ఎండు గంజాయి, 83 గంజాయి మొక్కలు, 286 గ్రాముల అల్ప్రాజోలం, 40 గ్రాముల క్లోరోహైడ్రెట్ ను నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లిలో గల శ్రీ మెడికేర్ సర్వీసె స్ లో కాల్చి దహనం చేసినట్లు ఎస్పీ తెలిపారు. చట్టపరిధిలో శాస్త్రీయ పద్దతిలో నిషేదిత మత్తుపదార్థాలను నిర్వీర్యం చేసినట్లు జిల్లా ఎస్పీ, డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ చైర్మన్ రాజేష్ చంద్ర వెల్లడించారు. ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారమే నిషేదిత మత్తు పదార్థాల దహనం, నిర్వీర్యం కార్యక్రమం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిషేదిత మత్తు పదార్థాల వినియోగంపై పోలీసు శాఖ నిఘా నిరంతరం కొనసాగుతుందన్నారు. మత్తు పదార్థాలు కనిపిస్తే 112కు లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.నర్సంహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, డీసీఆర్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
