Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 September 2025, 7:31 pm Posted by : ramakrishna

40 గేట్లను ఎత్తి 2,38,720 క్యూసెక్కుల నీటి విడుదల

మెండోరా, బతుకమ్మ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 40 గేట్లు ఎత్తి 2, 38,720 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీ లోకి 1,45,470 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారి రవి తెలిపారు. వరద కాలువ ద్వారా 6735 క్యూసెక్కులు కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కులు ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500 క్యూసెక్కులు సరస్వతి కాలువ ద్వారా 400 క్యూసెక్కులు లక్ష్మీకాల్లో ద్వారా 200 క్యూసెక్కులు అలిసాగర్ ఎత్తిపోతల పథకానికి 180కి క్యూసెక్కులు మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం  1091.00 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా సోమవారం 1090.30 అడుగులు 77.98 టిఎంసిల నీరు నిలువ ఉంది.