Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 March 2025, 6:15 pm Posted by : ramakrishna

4నుండి ఎమ్మార్పీఎస్ ప్రదర్శనలు

  • ఎస్సీ ల లోని అన్ని కులాలకు వర్గీకరణ ఫలాలు అందాలి
  • ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యెల్ మాదిగ

 

బతుకమ్మ, మాచారెడ్డి: ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకు అన్ని మండల జిల్లా కేంద్రాల్లో ఎమ్మార్పీఎస్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యెల్ మాదిగ తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల ను అన్ని కులాలకు న్యాయం జరిగేలా నాలుగు (ఎబీసీడీ) గ్రూపులుగా వర్గీకరించాలి. త్వరలోనే జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మాదిగ కులానికి చెందిన ఎమ్మెల్యే లకు ఇద్దరికీ ప్రాతినిధ్యం కల్పించాలి.  జస్టీస్ షమీమ్ అక్తర్  నివేదిక లో ఉన్న లోపాలను సరిచేసి ఎస్సీ ల్లోని అన్ని కులాల కు ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందేలా వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ  ఎమ్మార్పీఎస్ ఈ ప్రదర్శనలు ప్రదర్శనలు తలపెట్టిందన్నారు. అన్ని మండలాల ఎమ్మార్పీఎస్ అనుబంధ విభాగాలు, మాదిగ మహిళా విభాగం శ్రేణులు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.  వర్గీకరణ అంతిమ యుద్ధం లో భాగస్వాములు కావాలని కోరురారు. ఈకార్యక్రమంలో  మాచారెడ్డి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు బట్ట రమేష్ మాదిగ, జిల్లా మహిళా నాయకురాలు సట్టిగారి లక్ష్మి మాదిగ, బానపురం లావణ్య మాదిగ,  కాస్తారి శైలేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.