తడపాకల్ స్కూల్ కు 4 కంప్యూటర్లు అందజేత
ఏర్గట్ల, బతుకమ్మ : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) పథకం కింద కెనరా బ్యాంక్ ఏర్గట్ల బ్రాంచ్ మేనేజర్ రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో జెడ్పిహెచ్ఎస్ తడ్‌పాకల్ పాఠశాల విద్యార్థులకు యూపీఎస్ తో కూడిన 4 కంప్యూటర్లను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల లో డిజిటల్ విద్యా వాతావరణం ఎంతగా బలోపేతం చేస్తే విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు అంతగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ జావిద్ మాట్లాడుతూ కెనరా బ్యాంక్ వంటి సంస్థల సీఎస్ఆర్ కార్యక్రమాలు...