Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 7:49 pm Posted by : ramakrishna

తడపాకల్ స్కూల్ కు 4 కంప్యూటర్లు అందజేత

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) పథకం కింద కెనరా బ్యాంక్ ఏర్గట్ల బ్రాంచ్ మేనేజర్ రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో జెడ్పిహెచ్ఎస్ తడ్‌పాకల్ పాఠశాల విద్యార్థులకు యూపీఎస్ తో కూడిన 4 కంప్యూటర్లను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల లో డిజిటల్ విద్యా వాతావరణం ఎంతగా బలోపేతం చేస్తే విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు అంతగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ జావిద్ మాట్లాడుతూ కెనరా బ్యాంక్ వంటి సంస్థల సీఎస్ఆర్ కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయనీ అన్నారు. అనంతరం ఏర్గట్ల బ్రాంచ్ మేనేజర్ కి శాలువా పూలమాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుధాకర్, రాములు, రవి, నవీన్, భూపతి, ఆనంద్, చక్రపాణి, దేవానంద్ గౌడ్, కృష్ణ ప్రసాద్, స్వప్న, విజయ, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

 

4 computers donated to Tadapakal School