Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2025, 7:26 pm Posted by : ramakrishna

దసరా పండుగకు 388 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

  • జెబిఎస్ బస్టాండులో డిపోల వారిగా ప్రత్యేక ఆఫీసర్ల ఏర్పాటు
  • నిజామాబాద్ రీజియన్ మేనేజర్ టి.జ్యోష్న

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొత్తం 388 ప్రత్యేక బస్సు సౌకర్యాలను కల్పిస్తోందని ప్రయాణీకులు సద్వినియోగం చేసుకొవాలని నిజామాబాద్ రీజియన్ మేనేజర్ టి. జ్యోప్న ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ రీజియన్ నుండి సికింద్రాబాద్ (జెబిఎస్) వరకు, మళ్లీ తిరుగు ప్రయాణాలకు అదనపు బస్సులు నడుపుతున్నామని ఆర్ఎం వెల్లడించారు.. నిజామాబాద్ రీజియన్ ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా జెబిఎస్ బస్టాండులో డిపోల వారిగా ప్రత్యేక ఆఫీసర్ లను ఏర్పాటు చెయ్యడం జరిగిందని తెలిపారు. సికింద్రాబాద్ (జెబిఎస్) తో పాటు ఇతర ప్రాంతాలకు అధిక సంఖ్యలో ప్రయాణికులు వెళ్ళే అవకాశం ఉన్నందున, ఎటువంటి రవాణా సమస్యలు తలెత్తకుండా నిజామాబాద్ రీజియన్ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆర్ఎం తెలిపారు. ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడిచే తేదీలతోపాటు బస్సుల వివరాలను ఆమె వెల్లడించారు. దసరా పండగ సెలవుల సందర్భంగా ఈనెల 26వ ໖ 50, 275 80, 285 68, 295 50, 305 50, ໙໙ 15 50 మొత్తం 388 ప్రత్యేక బస్సులు నడపబడతాయని ఆర్ఎం తెలిపారు. ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవడం ద్వారా సౌకర్యవంతంగా, ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చని, టికెట్ బుకింగ్ సౌకర్యం ఆర్టీసీ ఆన్లైన్ వెబ్సైట్ (tgsrtcbus.in), టిఎస్ ఆర్టీసీ మొబైల్ యాప్లో అందుబాటులో ఉందని ఆర్ఎం ఆ ప్రకటనలో వెల్లడించారు.

388 special RTC buses for Dussehra festival