జుక్కల్, బతుకమ్మ : కౌలాస్ నాలా ప్రాజెక్టు రెండు గేట్లు విడుదల చేసి 3896 క్యూసెక్కుల వరద నీరు వాగులో విధులు చేశామని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ పేర్కొన్నారు. జుక్కల్ మండలంలోని సావర్ గాం గ్రామంలో కౌలాస్ నాలా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 458.00 మీటర్లు ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టులో 457.80 మీటర్లకు చేరుకుందని ప్రాజెక్టు ఏ ఈ రవిశంకర్ తెలిపారు. కౌలాస్ నాలా ప్రాజెక్టులో ఇన్ ప్లో 3822 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నాయని అయినా పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రం నుండి వరద నీరు వచ్చి ప్రాజెక్టులో చేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కౌలాస్ నాలా ప్రాజెక్టు రెండు గేట్లు విడుదల చేసి 3896 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేశామని తెలిపారు.