Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 October 2025, 5:40 pm Posted by : ramakrishna

36.25మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

మెండోరా, బతుకమ్మ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 36.25 మెగావాట్ల విద్యుత్ జరుగుతున్నట్లు జెన్ కో డీ ఈ ఈ శ్రీనివాస్ తెలిపారు. ఉత్పత్తి కేంద్రంలో నాలుగు యూనిట్లు ఉండగా నాలుగు యూనిట్ల ద్వారా ఇది ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు. యూనిట్-1 ద్వారా 9.00 మెగావాట్ల, యూనిట్ -2 ద్వారా 9.10 మెగావాట్ల, యూనిట్-3 ద్వారా 9.10మెగావాట్ల, యూనిట్ -4  ద్వారా 9.15 మెగావాట్ల మొత్తం 36.25 మెగావాట్ల  విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని ఆయన తెలియజేశారు.