నియోజకర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు

నిజామాబాద్, బతుకమ్మ: ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠానాకాలాన్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ధాన్యం సేకరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, రైతులు మిల్లలు వద్దకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. పంట మార్పిడీ దిశగా ఆలోచన చేయాలని రైతులకు సూచించారు. రైతులను అయోమయానికి గురి చేసే విధంగా మీడియాలో వార్తలు రాయొద్దని, వాస్తవాలు చూపాలని సూచించారు....