Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2024, 6:16 pm Posted by : ramakrishna

పీఎంఎఫ్ఎంఈ పథకం లో 35 శాతం సబ్సిడీ

. . . డీపీఎం మారుతి

భీమ్ గల్, బతుకమ్మ : 

 

ప్రైమినిష్టర్ ఫైనాన్స్ మైక్రో ఎన్వొల్మెంట్ పథకం లో రుణ లబ్ధిదారులకు 35 శాతం సబ్సిడీ లభిస్తుందని డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ మారుతి అన్నారు. శుక్రవారం పీ. ఎం.ఎఫ్. ఎం.ఈ పథకం కింద ఋణం తీసుకొన్న లబ్ధిదారులకు ఇందిరా క్రాంతి పథం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవేరేనెస్ ప్రోగ్రాం కు ముఖ్య అతిథిగా హాజరైన లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ పథకం ద్వారా చిన్న తరహా ఆహార ఉత్పత్తుల తయారీదారులకు వర్తిస్తుందన్నారు. ఈ పథకం లో రూ. 1లక్ష ఋణం తీసుకొన్నవారికి 35 శాతం ఋణం సబ్సిడీ వస్తుందని తెలిపారు. ఈ పథకం ద్వారా రూ. 50 లక్షల వరకు సబ్సిడీతో ఋణం పొందవచ్చునని అన్నారు. ఈ పథకం ద్వారా గానుగా నూనెల మిల్లు, దాల్ మిల్లులు, పిండి గిర్నీలు, అల్లం ఎల్లి మిషన్ లు ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీపీఏం కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఏం రవీందర్, సీసీలు కుంట శ్రీనివాస్, నరేష్, రఘుపతి, గంగాదర్, భాస్కర్, గంగ లలిత, ముత్యం గణేష్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.