Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 7:51 pm Posted by : ramakrishna

ఘనంగా విద్యా వికాస్ జూనియర్ కళాశాల 31వ వార్షికోత్సవం

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో 31వ వార్షికోత్సవం కళాశాల కరస్పాండెంట్ యార్లగడ్డ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానవ కోటేశ్వరరావు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతర గేయం, జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ బోధన్ అనేది అనేక విద్యాసంస్థల నిలయంతో ఒక విద్యారంగా ధనాగారంగా విరాజిల్లుతుందని ఇక్కడ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో విద్యార్థులు ఎదిగారని అన్నారు. రానున్న ఐపిఈ పరీక్షల్లో విద్యార్థులు రాణించాలని కోరారు. అతిథులను కళాశాల యాజమాన్యం తరఫున ఘనంగా సన్మానించారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఫౌండర్ బసవేశ్వర రావు, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్, పట్టణ అధ్యక్షులు హరికృష్ణ, వివిధ విద్యా సంస్థల ప్రముఖులు కృష్ణమోహన్, విజయ్, సురేష్, జయప్రకాష్, రాజు, కళాశాల అధ్యాపకులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

 

31st anniversary of Vidya Vikas Junior College celebrated with great pomp