31 మంది మావోలు మృతి : బస్తర్ ఏరియా ఐజీ సుందర్ రాజ్
బస్తర్ ఏరియా, బతుకమ్మ : ఛత్తీస్ ఘడ్ లో ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో మొత్తం 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఏరియా ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. బీజాపూర్ నేషనల్ పార్కు సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగిందని తెలిపారు. ఈఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు.