కల్తీ కల్లు తాగి 30 మందికి అస్వస్థత, ఆరుగురు సీరియస్
వింతగా ప్రవర్తిస్తున్న బాధితులు కామారెడ్డి జిల్లా గాంధారి(మం) గౌరారం గ్రామంలో ఘటన కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీకల్లు కలకలం రేపింది. గాంధారి(మం) గౌరారం గ్రామంలో కుస్తీ పోటీల సందర్భంగా మంగళవారం గ్రామస్తులు కల్లు తాగారు. ఇందులో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కల్లు దుకాణం పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కల్లు తాగిన బాధితులు...