డీజీపీ ఎదుట లొంగిపోనున్న 30 మంది మావోయిస్టులు
వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట సుమారు 30 మంది మావోయిస్టులు లొంగిపోతున్నట్లు సమాచారం. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆజాద్ అలియాస్ కొయ్యడ సాంబయ్య, అప్పాస్ నారాయణ, ఎర్రాలు తదితరులున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ ఈవివరాలు వెల్లడించనున్నారు. కాగా, ఆజాద్ తలపై రూ. 20 లక్షల రివార్డు ఉంది.