Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 12:13 pm Posted by : ramakrishna

డీజీపీ ఎదుట లొంగిపోనున్న 30 మంది మావోయిస్టులు

వెబ్ న్యూస్, బతుకమ్మ :  తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట సుమారు 30 మంది మావోయిస్టులు లొంగిపోతున్నట్లు సమాచారం. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆజాద్ అలియాస్ కొయ్యడ సాంబయ్య, అప్పాస్ నారాయణ, ఎర్రాలు  తదితరులున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ ఈవివరాలు వెల్లడించనున్నారు.  కాగా, ఆజాద్ తలపై రూ. 20 లక్షల రివార్డు ఉంది.