పుష్కరస్నానమాచరించిన 30 లక్షల మంది భక్తులు
వైభవంగా ముగిసిన సరస్వతి పుష్కరాలు చివరి రోజూ బారులు తీరిన భక్తులు కాళేశ్వరం, బతుకమ్మ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో 12 రోజుల పాటు జరిగిన సరస్వతి పుష్కరాలు సోమవారం రాత్రి 8.10 గంటలకు వైభవంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా సరస్వతి మాతకు విశేష పూజలు నిర్వహించారు. సరస్వతి ఘాట్ వద్ద నిర్వహించిన నవరత్నమాల హారతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సరస్వతి పుష్కరాల ప్రత్యేకతను, కాళేశ్వర క్షేత్ర వైభవాన్ని ప్రముఖ అవధాని మాడుగుల నాగఫణిశర్మ వివరించారు. తొలి రోజు నుంచి చివరి రోజు...