డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి 3 రోజుల జైలు శిక్ష
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తాగి వాహనం నడిపిన వ్యక్తి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ బేగం బుధవారం మూడు రోజుల జైలు శిక్ష విధించారు. తాగి వాహనాలు నడిపిన 31మందికి ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ పి.ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. వీరిలో 30 మందికి రూ.59,200 జరిమానా విధించారు. ఆర్మూర్ కు చెందిన కోయల్కర్ శ్రీనివాస్ కు మూడు రోజుల జైలు శిక్ష విధించారు.