Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 6:27 pm Posted by : ramakrishna

పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎల్లారెడ్దిపేట, ముస్తాబాద్ మండలాల్లో పోలీస్ ల ఆధ్వర్యంలో 2 కె రన్ నిర్వహించారు.ఎల్లారెడ్డిపేట లోని పాత బస్ స్టాండ్ నుండి హెచ్ పి పెట్రోల్ బంక్ వరకు 2 కె రన్ నిర్వహించారు. ముస్తాబాద్ లో ముస్తాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ఏఎంఆర్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. 2 కె రన్ లో విజేతలుగా నిలిచిన వారికి ఆయా పోలీస్ స్టేషన్ ల ఎస్ ఐ లు బహుమతులు అందించారు.ఈ కార్యక్రమం లో ఎల్లారెడ్దిపేట, ముస్తాబాద్ ఎస్ ఐ లు కె. రాహుల్ రెడ్ది, చిందం గణేష్ ఎల్లారెడ్దిపేట ఏఎస్ఐ పాషా, కానిస్టేబుళ్ళు మహేందర్, బాబయ్య, రాజశేఖర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్ది, బీజేపీ నాయకులు చల్ల సత్యం రెడ్ది తో పాటు విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

2K run under the supervision of the police