రేపు మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 2కె రన్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హైపర్ టెన్షన్ పై అవగాహన కోసం నిజామాబాద్ నగరంలోని మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం 2కె రన్ నిర్వహిస్తున్నట్లు మెడికవర్ ఆసుపత్రి ఇంటర్వేషనల్ కార్డియాలజిస్టు డా.సందీప్ రావు తెలిపారు. మెడికవర్ ఆసుపత్రిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మే 17న ప్రపంచ హైపర్ టెన్షన్ డే (బీసీ దినోత్సవం)ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైపర్ టెన్షన్ డే రోజున నిజామాబాద్ నగరంలోని మెడికవర్ ఆసుపత్రి నుంచి పూలాంగ్ చౌరస్తా వరకు అక్కడి నుంచి...