నందిపేట్, బతుకమ్మ : మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఎక్తా దివాస్ కార్యక్రమాన్ని నందిపేట్ మండల పోలీస్ శాఖా ఆధ్వర్యంలో 2 కె రన్ నిర్వహించారు ఈ కార్యక్రమం వివేకానందచౌరస్తానుండినందిపేట్ ప్రధాన కూడలిలో కొనసాగింది అనంతరం ఎస్సై శ్యామ్ రాజ్ మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ బాయ్ ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా భారతదేశం లో జరుగుతున్నజాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలోకొనసాగుతున్నస్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు.. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్ర్యానంతరం జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోనికేంద్రమంత్రి మండలిలో హోంశాఖ మంత్రి గానూ, భారత ఉప ప్రధాన మంత్రి గానూ బాధ్యతలను నిర్వహించాడు. అనంతరం భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చింది చెప్పారు ఈ కార్యక్రమాన్నివిజయవంతం చేసేందుకు యువత, స్కూల్ విద్యార్థులు, నాయకులు పాల్గొని విజయవంతం చేయడం ఎంతో ఆనందకరం అన్నారుఈ కార్యక్రమం లో నందిపేట్ ఎస్సై 2 రాము,పోలీస్ సిబ్బంది, విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.