పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్
భీమ్ గల్, బతుకమ్మ : జాతీయ సమైక్యత దినోత్సవం ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని, పోలీస్ అమరవీరుల వారోత్సవాల ముగింపు సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భీమ్ గల్ మండల కేంద్రంలో 2కే రన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్సై సందీప్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల వారోత్సవాలు, జాతీయ ఐక్యత దినోత్సవం సందర్బంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, యువత పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు....