రుద్రూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 కే రన్
రుద్రూర్, బతుకమ్మ : సర్ధార్ వల్లాబాయ్ పటేల్ జయంతి సందర్బంగా, రాష్ట్రీయ సమన్వయ దివాస్ ను పురస్కరించుకొని రుద్రూర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అక్బర్ నగర్ ఫుడ్ సైన్స్ కళాశాల వద్ద 2 కె రన్ ను నిర్వహించారు. ఈ 2 కె రన్ లో పోలీసు సిబ్బంది, ఫుడ్ సైన్స్ కళాశాల విద్యార్థులు, ప్రముఖులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.