Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 January 2026, 7:30 pm Posted by : ramakrishna

ఎంపి అర్వింద్ చోరవతో విదేశాలలో చిక్కుకున్న297మంది యువతకు విముక్తి

ఉపాధి కోసం థాయిలాండ్ మయన్మార్‌ కు వేళ్లి చిక్కుకున్న యువత

. . . తెలుగు యువత చేత  సైబర్ మోసాలు చేస్తున్న ముఠా

. . . పార్లమెంట్ లో ప్రస్తావించిన ఎంపీ అర్వింద్

. . .  తెలుగు యువత రక్షించినట్టు కేంద్ర విదేశాంగ శాఖ

 ఢిల్లీ, బతుకమ్మ :

నకిలీ ఉద్యోగాల పేరిట రెండు తెలుగు రాష్ట్రాల యువత ను అక్రమంగా రవాణా థాయిలాండ్, మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో టాచిలేక్, ష్వే కొక్కో, మయా వాడీ ప్రాంతాలకు తరలించి బలవంతంగా సైబర్ నేరాలను చేస్తున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. లోక్‌సభలో రూల్ 377 కింద నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ యువత మోసానికి గురైన అంశంను ప్రస్తావించి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విదేశాంగ శాఖ సమగ్రంగా స్పందించింది. 2,545 మంది భారతీయులు అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. అందులో 2,390 మంది భారతీయులు విముక్తి కల్పించారు. భారత రాయబార కార్యాలయాలు (థాయిలాండ్,మయన్మార్) చేపట్టిన చర్యల ఫలితంగా ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల నుంచి 316 మంది బాధితులు ఉన్నట్లు తెలిపారు.అందులో 297 మంది ఇప్పటికే సురక్షితంగా రక్షింపబడ్డారు. ఈ సందర్భంగా ఎంపి అర్వింద్ మాట్లాడుతూ… భారతీయుల భద్రతకు కేంద్రం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయులు భద్రత, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు.