Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 6:07 pm Posted by : ramakrishna

29టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

  • కాలుర్ శివారులో పార్కింగ్ వద్ద పట్టుకున్న పోలీసులు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రం శివారులో దాదాపు 29 టన్నుల పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని రూరల్ పోలీస్ స్టేషన్ కు లారీని తరలించారు. నిర్మల్ జిల్లా చించోలి మాజిద్ అనే రైస్ మిల్లర్ నుండి  నిజామాబాద్ కు తరలిస్తున్న క్రమంలో  పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు విశ్వసనీయంగా సమాచారం అందడంతో ఈ మేరకు దాడులు చేయగా రైస్ మిల్లులకు అడ్డా ఐనా  కాలూరు రోడ్డులో గల పార్కింగ్ వద్ద నిలిచి ఉన్న 29టన్నుల లారీని స్వాధీనం చేసుకొని రూరల్ పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • సూపర్ మార్కెట్ కోసం పీడీఎస్ బియ్యమా..?

నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్లు సీయంఆర్ కోసం ధాన్యం తీసుకుని బహిరంగ మార్కెట్ లో అమ్ముకున్న చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో ఎఫ్ సిఐ కి సీయంఆర్ అప్పగించేందుకు రేషన్ బియ్యంపై ఆధారపడిన విషయం విధితమే. జిల్లా కేంద్రంను అనుకుని కాలుర్, ఖానాపూర్, గుండారం, శ్రీనగర్ వరకు రైస్ మిల్లులు విస్థరించి ఉన్నాయి. వారికి అవసరమైన పీడీఎస్ రైస్ ను తరలించేందుకు నిర్మల్ జిల్లా నుంచి వచ్చిన రేషన్ బియ్యం లారీని పట్టుకోగావారివద్ద ఆన్ లైన్ లో సూపర్ మార్కెట్ కు బియ్యం తరలిస్తున్న బిల్లులు లభ్యమయ్యాయి. సూపర్ మార్కెట్ కు బియ్యం తరలిస్తున్నట్టు రిసిప్ట్ పట్టుకొని రేషన్ బియ్యంను మిల్లులకు తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు.

29 tons of PDS rice seized