హెటెరో డ్రగ్స్ వాక్ – ఇన్ ఇంటర్వ్యూలలో 29 మంది విద్యార్థులు ఎంపిక
డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ ఔషధ సంస్థ హెటెరో డ్రగ్స్, హైదరాబాద్ బుధవారం నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూలలో తెలంగాణ యూనివర్సిటీ రసాయనశాస్త్ర విభాగంతో పాటు అనుబంధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్వ్యూల అనంతరం మొత్తం 29 మంది అభ్యర్థులు ఎంపికై నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎంపికలో డిగ్రీ అర్హతతో 10 మంది, ఎంఎస్సీ అర్హతతో 19 మంది ఎంపికయ్యారు. ఎంఎస్సీ అర్హతతో ఎంపికైన వారిలో 13 మంది పురుషులు, 6 మంది...