Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 5:41 pm Posted by : ramakrishna

మావోయిస్టుల డంప్‌లో 280 బీజీఎల్ షెల్స్ స్వాధీనం!

 

. . . లొంగిపోయిన వారి సమాచారంతో తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో మూడు డంపులు గుర్తింపు..!

 

భద్రాది కొత్తగూడెం, బతుకమ్మ :

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు భారీగా మావోయిస్టు ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు అందించిన విశ్వసనీయ సమాచారంతో నవంబర్ 16న చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ బృందం కలిసి తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని పూజారి కాంకేర్ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు.ఈ తనిఖీల్లో సీపీఐ మావోయిస్టు పార్టీ PLGA బెటాలియన్‌కు చెందిన మూడు రహస్య డంపులను గుర్తించారు. వాటిలో సింథటిక్ వాటర్ ట్యాంక్ డ్రమ్స్‌లో దాచిన మొత్తం 280 బీజీఎల్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

. . . 2025లో దాచిన ఆయుధ సామగ్రి

2025 ప్రారంభంలో పీఎల్ జీఏ  బెటాలియన్ వికేంద్రీకరణ సమయంలో మొదటి కంపెనీకి చెందిన ఈ షెల్స్‌ను భవిష్యత్తు అవసరాల కోసం అడవిలో దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. మావోయిస్టు కార్యకలాపాలు తిరిగి పుంజుకున్నప్పుడు వీటిని ఉపయోగించాలనే ఉద్దేశంతో డంపులు ఏర్పాటు చేసినట్లు పోలీసుల ప్రకటనలో పేర్కొన్నారు.

. . . లొంగుబాట్లతో వెలుగులోకి రహస్య డంపులు

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సరెండర్, పునరావాస విధానంతో లొంగిపోయిన మావోయిస్టులకు నగదు రివార్డులు, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి, స్వయం ఉపాధి రుణాలు, ఆరోగ్య కార్డులు, నైపుణ్య శిక్షణ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సదుపాయాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన వారు పార్టీ రహస్య డంపుల సమాచారాన్ని పోలీసులకు అందిస్తున్నారని వెల్లడించారు.ఇంకా అజ్ఞాతంలో ఉన్న ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పోలీస్ శాఖ పిలుపునిచ్చింది.

280 BGL shells seized from a Maoist dump!