Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 August 2025, 4:34 pm Posted by : ramakrishna

ఏడు పోలీస్ స్టేషన్లో పరిధిలోని 28 మంది బైండోవర్

నిజామాబాద్, బతుకమ్మ : ఆదనపు జిల్లా మెజిస్ట్రేట్,  కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ ముందు ఏడు పోలీస్ స్టేషన్లో పరిధిలోని 28 మందిని బైండోవర్ చేశారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం, మిలాద్-ఉల్-నబి,  దుర్గామాత ఉత్సవం  సందర్భంగా సీపీ పి.సాయి చైతన్య ఆదేశాల ప్రకారం , డీజేఆపరేటర్లు, డీజే యజమానులు, ట్రబుల్ మాంగర్స్ ,  నిజామాబాద్  డివిజన్, ఆర్మూర్ డివిజన్ పరిధిలో గల వివిధ పోలీస్ స్టేషన్ల లలో గతంలో నమోదైన కేసులలోని నిందితులను వచ్చే ఆరు నెలల పాటు సత్ప్రవర్తన ను కొనసాగించడానికి  డీజే యజమానులకు రూ.2 లక్షలు, ట్రబుల్ మాంగర్స్ లక్ష, డీజే ఆపరేటర్లకు రూ.50,000/- స్వంత పూచీకత్తు పై బైండోవర్ చేశారు. పూచీకత్తు కాలంలో మళ్ళీ నేరాలు చేసినట్లు అయితే పూచీకత్తు ఇచ్చిన రూపాయలను జప్తు చేయబడుతుందని, లేని యెడల జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు.  నిజామాబాద్ ఆరో టౌన్ పరిధిలో నలుగురు, నిజామాబాద్  రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు, నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు, నిజామాబాద్ ఐదో టౌన్ పరిధిలో ఒకరు, కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరు, నిజామాబాద్ నాలుగో టౌన్ పరిధిలో 9మందిని బైండోవర్ చేశారు.

28 people under the jurisdiction of seven police stations were bound over