Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 December 2024, 3:31 pm Posted by : ramakrishna

26న సీపీఐ 100వ ఆవిర్భావ దినోత్సవం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రజా, కార్మిక సమస్యలపై వందేళ్లుగా సీపీఐ రాజీలేని పోరాటాలు చేస్తోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 26న సీపీఐ 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామగ్రామాన పార్టీ జెండాలను ఆవిష్కరించి ఉత్సవాలను నిర్వహించాలని నాయకులను, కార్యకర్తలను కోరారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి వై ఓమయ్య,  నాయకులు సఖి సురేశ్, ఇమ్రాన్ అలీ, భాను, సత్యం, లింగం, సాయిలు పాల్గొన్నారు.