Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 November 2024, 1:22 pm Posted by : ramakrishna

26 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు

నిజామాబాద్, బతుకమ్మ: రాష్ట్రంలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల సముదాయాల(ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ కాంప్లెక్సె)ను ప్రభుత్వం మంజూరు చేసింది. మొదటి దశలో 28 నియోజకవర్గాలకు మంజూరు చేయగా, తాజాగా రెండో దశలో 26 ప్రాంతాల్లో సమీకృత గురుకుల పాఠశాలల సముదాయాలను మంజూరు చేస్తూ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రెండోదశలో మంజూరైన వాటిలో బోధన్, పెద్దపల్లి, డోర్నకల్, సత్తుపల్లి, వైరా, కోదాడ, కొత్తగూడెం, నకిరేకల్, నాగార్జునసాగర్, తాండూరు, మక్తల్, రామగుండం, నారాయణపేట, జుక్కల్, చొప్పదండి, కల్వకుర్తి, నిజామాబాద్‌ రూరల్, వనపర్తి, చేవెళ్ల, జగిత్యాల, వికారాబాద్, గద్వాల, ధర్మపురి, మెదక్, మేడ్చల్, ఆర్మూర్‌ నియోజకవర్గాలు ఉన్నాయి.