- జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
బతుకమ్మ, పిట్లం : మండలంలో ఎల్ఆర్ఎస్ సంబంధించిన ఫీజుకు ఈ నెల మార్చి 31 వరకు 25 శాతం ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ తెలిపారు. శనివారం పిట్లం మండలంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. జిల్లాలో ఎల్ఆర్ఎస్ సంబంధించి ప్రత్యేక రాయితీ 25% ఈనెల 31 వరకు ఇస్తున్నట్లు తెలిపారు. దానికి సంబంధించి గ్రామ కార్యదర్శి బలరామును మండలంలో ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన ప్లాట్లు ఎన్ని ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ ప్లాట్లను త్వరగా రాయితీ ఉన్నట్లు లబ్ధిదారులకు తెలిపి ప్లాట్ లకు సంబంధించిన రుసుమును చెల్లించుకోవాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నమూనా హౌస్ ను పరిశీలించారు. మండల కేంద్రంలోని తాసిల్ కార్యాలయం వెనుక భాగంలో ఇందిరమ్మ ఇండ్ల నమూనా ఇల్లును నిర్మిస్తున్న సంబంధించిన నమూనాను వాటి యొక్క విధి విధానాలను క్లుప్తంగా తెలుసుకున్నారు . 5 లక్షల లో ఇల్లు నిర్మించుకోవడం ఎలా అని ఈ నమూనాను చూసి లబ్ధిదారులు కట్టుకోగలరని తెలిపారు.

అలాగే జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలను తనిఖీ చేశారు. పదవ తరగతి పరీక్షలు ముందు ముందు ఉన్న పరీక్షలకు సంబంధించి విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా శాతం మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ విద్య విద్యను అందిస్తున్నాము అని అన్నారు. విద్యార్థులు కష్టపడి ఇష్టపడి చదివి మండలానికి జిల్లాకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని పాఠశాల ఉపాధ్యాయుల కృషిని మీరు 100% ఉత్తీర్ణులైతే ఉపాధ్యాయుల ఫలితం ఫలిస్తుందని కోరారు. ఈరోజు నుండి ఒంటిపూట బడి ఉన్నందున విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం జిల్లా కలెక్టర్, డివిజన్ కలెక్టర్ మండల అధికారులు కలసి భోజనం చేశారు. విద్యార్థులకు రోజు ఇలాగే భోజనం అందించాలని ప్రధానోపాధ్యాయునికి సూచించారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలో విద్యార్థుల సంఖ్యను తెలుసుకొని విద్యార్థులకు అందిస్తున్న మెనూ ప్రకారము గర్భిణులకు బాలింతలకు పిల్లలకు అందుతున్నాయా లేవని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ టీచర్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని టీచర్ ప్రవీణ ను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాగే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ పిల్లలను తీర్చిదిద్దాలని ఆమెకు సూచించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా విద్యాధికారి రాజు, ఎంపీడీవో కమలాకర్, ఎంపీ ఓ రాజు, పిడి ప్రమీల, సిడి పిఓ సౌభాగ్య,ఉప తాసిల్దార్ సత్యనారాయణ,ఆర్ఐ శీతల్, ఎంఈఓ దేవి సింగ్, పి ఆర్ ఏ ఈ పోచయ్య, కార్యదర్శి బలరాం, మండల స్థాయి అధికారులు ఉన్నారు.
