- నేడు మద్యం షాప్ ల దరఖాస్తులకు చివరి రోజు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రభుత్వం గడువు పొడగించిన మద్యం షాప్ ల లైసెన్స్ లు దక్కించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నెల 18న ఏ4 మద్యం షాప్ ల నిర్వహణకు టెండర్ల దరఖాస్తు ఫారాల గడువు ముగిసిన విషయం తెల్సిందే. నిజామాబాద్ జిల్లాలోని 102 మద్యం షాప్ లకు 2633 దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రభుత్వం తగినంత స్పందన లేదని, గడువును ఈ నెల 23 వరకు పొడగించింది. ఈ నెల 21, 22 తేదిల్లో నిజామాబాద్ ఎస్ హెచ్ వో పరిధిలో 8, బోధన్ లో 3, ఆర్మూర్ లో 9, భీంగల్ లో 1, మోర్తాడ్ లో 4 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 27న జిల్లా కేంద్రంలోని భారతి గార్డెన్ లో లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటాయించడం జరుగుతుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. ఈ నెల 23న చివరి రోజు కావడంతో సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.